అమృత నగర్ త్రాగునీటి సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం
- PRASANNA ANDHRA

- May 12, 2023
- 1 min read
అమృత నగర్ త్రాగునీటి సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం


వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అమృత నగర్ నందు పర్యటించినప్పుడు, ప్రజలు ఆయన వద్దకు పలు సమస్యలను తీసుకురాగా, శుక్రవారం ఉదయం కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, సెక్రెటరీ గురు మోహన్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డ్రైడే సందర్భంగా నాలుగు, ఐదు సచివాలయాల పరిధిలో పర్యటించి అక్కడ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ప్రధానంగా శానిటేషన్, త్రాగునీరు, వీధిలైట్లు సమస్యలను గుర్తించామని, త్వరలో తగు మౌలిక సదుపాయాలు సమకూరుస్తామని తెలిపారు. అనంతరం కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి మాట్లాడుతూ, మడూరు పరిధిలోని 35 రోడ్లకు త్రాగు నీటి వసతిని కల్పిస్తూ నేడు మోటార్లను ప్రారంభించామని, ఇకపై 24 గంటల మంచినీటి సరఫరా సౌకర్యం అమృత నగర్ ప్రజలకు లభించనుందని, ఇక్కడ మురుగునీటి వ్యవస్థ అధ్వానంగా ఉండటం చేత త్వరలో నిధులు సమకూర్చి కాలువలు నిర్మిస్తామని అన్నారు. పాత అమృత నగర్ నుండి ప్రధాన రహదారి వరకు శానిటేషన్ ప్రక్రియ పూర్తి చేశామని, ఇందుకుగాను సహకారం అందించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి కి, నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, పలువురు వైసిపి నాయకులు, అమృత నగర్ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.










Comments