30వ తేదీన కలెక్టరేట్ వద్ద ధర్నాను జయప్రదం చేయాలి. సిపిఎం.
- DORA SWAMY

- May 28, 2022
- 1 min read
ఈ నెల 30న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయండి... సి పి ఎం.
--ఇంధన, నిత్యావసర ధరలు తగ్గించాలని డిమాండ్.

అన్నమయ్య జిల్లా,చిట్వేలి లో ఈ రోజున అధిక ధరలను అరికట్టాలని కోరుతూ ఈ నెల 30న కలెక్టర్ కార్యాలయం నందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పందికాళ్ళ మణి, కెవిపిఎస్ డివిజన్ కన్వీనర్ ఓబిలి పెంచలయ్య లు కోరారు.
సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక చిట్వేలి ఆటో స్టాండ్ నందు ధర్నా కు సంబంధించి గోడ పత్రాలను విడుదల చేసి ఈ సందర్భంగా మణి.. పెంచలయ్య మాట్లాడుతూ పెట్రోలు. డీజల్. వంట గ్యాస్. నిత్యవసర సరుకులు మొత్తం దేశవ్యాప్తంగా ప్రజల పైన భారం మోపుతూ పేదల నడ్డి విరుస్తు రోజు రోజుకి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఈరోజు మార్కెట్లో చూస్తే ఏ కూరగాయలు కొందామన్నా నూరు రూపాయలు తక్కువ లేకుండా ఉన్నాయని సామాన్య మానవుడు కనీసం పప్పు, రసం తినే పరిస్థితి కూడా లేదని ఇంత దారుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల పైన అధిక భారాన్ని మోపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వెంటనే పెట్రోల్ ,డీజిల్, వంట గ్యాస్,వంట నూనెలు, నిత్యవసర వస్తువులు,కరెంట్ చార్జీలు,బస్ చార్జీలు, ఆస్తిపన్ను,నీటి పన్ను,చెత్త పన్ను తదితర ప్రజల పై మోపిన భారాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
గ్యాస్ సిలిండర్ ధర పూర్వం 450 రూపాయలు ఉండేదని అదే సిలిండర్ ఇప్పుడు 1050 రూపాయల నుండి 1100 వందల రూపాయల వరకు పెంచారని వంట నూనె ధర సామాన్యునికి అందనంత ఎత్తుకు చేరిందని వాటిని కొనలేని స్థితిలో ప్రజలు ఉన్నారని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఇంధన నిత్యవసర ధరలను తగ్గించాలని కోరారు.ఈ ధర్నాలో కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జె ఎన్ ఆంధ్రయ్య .సిపిఎం సీనియర్ నాయకులు మడగళ ఆనందయ్య సుబ్బరాయుడు ఆటో యూనియన్ కార్మికులు పాల్గొన్నారు.








Comments