top of page

పార్టీ ప్లీనరీ సమావేశాన్ని జయప్రదం చేయండి ఎమ్మెల్యే కొరముట్ల.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jun 26, 2022
  • 1 min read

ఈనెల 28న జరగబోవు పార్టీ ప్లీనరీ సమావేశాన్ని జయప్రదం చేయండి .

ఎమ్మెల్యే కొరముట్ల.


ree

ఈనెల 28/6/2022 న మంగళవారం నాడు ప్రభుత్వ విప్ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు అధ్యక్షతన మధ్యాహ్నం రెండు గంటలకు స్థానిక రైల్వేకోడూరు పట్టణంలోని రాజ్ కన్వెన్షన్ నందు వైయస్సార్సీపి నియోజకవర్గస్థాయి మినీ ప్లీనరీ నిర్వహించబడుతుందని, ఇందులో పార్టీ విధివిధానాల గురించి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గ్రామ,మండల స్థాయి ప్రతినిధుల అభిప్రాయాలు,పార్టీ

పటిస్టానికి వారి సూచనలు, సలహాలు లాంటివి అన్నియూ పరిగణలోకి తీసుకొని సమగ్రంగా చర్చించబడతాయని కొరముట్ల పేర్కొన్నారు.


ఈ ప్లీనరీ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాజంపేట పార్లమెంట్ సభ్యులు పీవీ మిథున్ రెడ్డి,వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు గడికోట శ్రీకాంత్ రెడ్డి హాజరుకానున్నారని కావున నియోజకవర్గ పరిధిలోని మండల అధ్యక్షులు, జడ్పిటిసిలు, సొసైటీ ప్రెసిడెంట్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులు, వివిధ కమిటీల సభ్యులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు తప్పకుండా హాజరుకావాలని శాసనసభ్యులు కొరుముట్ల శ్రీనివాసులు కోరారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page