పవన్ పై పోటీకి సిద్ధం - అలీ
- PRASANNA ANDHRA

- Jan 17, 2023
- 1 min read

అమరావతి: పవన్ పై పోటీకి సిద్ధం - అలీ
ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు మరియు నటుడు అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసిపి అధిష్టానం ఆదేశిస్తే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై పోటీకి సిద్ధమని ఆయన ప్రకటించారు. రాజకీయాల్లో విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం సాధారణమన్నారు. రాజకీయాలు వేరు సినిమాలు వేరు అని తెలిపారు. పవన్ తనకు మంచి మిత్రుడేనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసిపి గెలుపు ఖాయమని అలీ ధీమా వ్యక్తం చేశారు.








Comments