నరసింహ స్వామి భక్తుల ఆకలి తీర్చిన దాతలు.
- DORA SWAMY

- May 15, 2022
- 1 min read
శ్రీ పెనుశిల లక్ష్మినరసింహ స్వామి తిరుణాల సందర్భంగా పలుచోట్ల అన్నదానం - పాదాల గుడిని దర్శించుకున్న సాయి లోకేష్ - విరివిగా పాల్గొన్న వేలాది మంది భక్తులు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నందు వెలసియున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి తిరుణాల మహోత్సవం సందర్భంగా ఆలయానికి వెళ్ళు మరియు తిరిగి ఇంటికి చేరుకునే భక్తులకు చిట్వేలు మండల పరిధిలోని రాపూరు రహదారి వెంబడి పలుచోట్ల దాతలు అన్నదానం నిర్వహించి వేలాది మంది భక్తులకు ఆకలి తీర్చారు.

ఈ క్రమంలో తిమ్మాయిపాలెం క్రాస్ రోడ్ సమీపంలో నరసింహ స్వామి పాదాల గుడి వద్ద దాత వెంకటసుబ్బయ్య మరియు కుటుంబ సభ్యులు భక్తులకు అన్నదానం నిర్వహించగా.. బిజెపి ప్రతినిధి సాయి లోకేష్ ఈరోజు ఉదయం మండల నాయకులతో కలిసి పెంచల స్వామి పాదాల ఆలయాన్ని దర్శించుకున్నారు.
కాగా రాజుకుంట క్రాస్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర సదరు గ్రామపంచాయతీ సర్పంచ్ నరసింహులు కుటుంబ సభ్యులు భక్తులకు అన్నదానం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో చిట్వేలు, రాజుకుంట, అనుంపల్లి గ్రామాల యువత పెద్ద ఎత్తున పాల్గొని భక్తులందరికీ పెద్ద ఎత్తున ఆకలి తీర్చారు.








Comments