అగస్తేశ్వర స్వామి ఆలయం నందు అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు
- MD & CEO

- Nov 20
- 1 min read
అగస్తేశ్వర స్వామి ఆలయం నందు అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు

ప్రొద్దుటూరు నడిబొడ్డున వెలిసిన శ్రీ ఆగస్తేశ్వర ఆలయం నందు అమావాస్య సందర్భంగా స్వామి వారికి ప్రదోష కాల సమయంలో పంచామృత, నానావిధ సుగంధ ద్రవ్య, రుద్రాభిషేకము అలాగే స్వామి వారికి సహస్రనామ భస్మార్చన, భస్మహారతి, అమ్మవారికి కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు. వందలాది మంది భక్తాదులు తరలి వచ్చి స్వామి వారిని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈ.ఓ మరియు సహాయ కమీషనరు జే.వెంకట సుబ్బయ్య, ఆలయ చైర్మన్ వంగల నారాయణ రెడ్డి, పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో అర్చక స్వాములచే పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.









Comments