నటుడు కమల్ హాసన్ కు తీవ్ర అస్వస్థత
- PRASANNA ANDHRA

- Nov 24, 2022
- 1 min read
నటుడు కమల్ హాసన్ కు తీవ్ర అస్వస్థత
ప్రముఖ నటుడు మరియు రాజకీయ నాయకుడు కమల్ హాసన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో చెన్నై పోరూరు రామచంద్ర ఆస్పత్రికి కమలహాసన్ ను తరలించారు ఆయన కుటుంబ సభ్యులు.

నిన్నటి నుంచి తీవ్ర జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడం లో కమలహాసన్ ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న అర్ధరాత్రి హీరో కమల్ హాసన్ ను రామచంద్ర ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. దీంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకొని ఇంటికి రావాలని పూజలు చేస్తున్నారు కమల్ హాసన్ ఫ్యాన్స్. కాగా నిన్న జ్వరంతో ఉన్నప్పటికీ హైదరాబాద్ వచ్చి వెళ్లారు కమల్ హాసన్. నిన్నటి హైదరాబాద్ పర్యటనలో కే విశ్వనాథ్ గారిని కమల్ హాసన్ కలిసి వెళ్లారు.









Comments