top of page

సినీనటుడు కాస్ట్యూమ్స్‌ కృష్ణ కన్నుమూత

  • Writer: EDITOR
    EDITOR
  • Apr 2, 2023
  • 1 min read

టాలీవుడ్‌లో విషాదం.. సినీనటుడు కాస్ట్యూమ్స్‌ కృష్ణ కన్నుమూత

ree

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్‌ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్‌ కృష్ణ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. విజయనగరం జిల్లా, లక్కవరపు కోటలో జన్మించిన కృష్ణ.. చాలా సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేశారు. 1980ల్లో వచ్చిన అనేక మంది అగ్ర హీరోల సినిమాలకు ఆయన కాస్ట్యూమ్స్‌ అందించారు. ఆ తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘భారత్‌ బంద్‌’ సినిమాతో కాస్ట్యూమ్స్‌ కృష్ణ నటుడిగా పరిచయమయ్యారు. . ఆ సినిమాలో కాస్ట్యూమ్ కృష్ణ విలన్‌గా నటించి మెప్పించారు. ఆ తర్వాత విలన్‌, సహాయ పాత్రల్లో నటించారు. పెళ్లి పందిరి సహా 8 చిత్రాలకు నిర్మాతగానూ ఆయన వ్యవహరించారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page