top of page

హత్య కేసులో ముద్దాయి అరెస్ట్

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Aug 1, 2023
  • 1 min read

TO WATCH VIDEO CLICK ON THIS LINK : https://youtu.be/Dy3mr2FsNnk


హత్య కేసులో ముద్దాయి అరెస్ట్


కడప జిల్లా, ప్రొద్దుటూరు


సోమవారం ప్రొద్దుటూరులోని ఈశ్వర్ రెడ్డి నగర్ లో హత్యోదంతం వెలుగులోకి రావడంతో ఒక్కసారి ఉలిక్కిపడ్డ ప్రొద్దుటూరు నగరవాసులు. నిందితుడిని అరెస్టు చేసి వివరాలు వెల్లడించిన ప్రొద్దుటూరు ఏఎస్పి ప్రేరణకుమార్ ఐపీఎస్. సమావేశంలో పాల్గొన్న ఒకటవ పట్టణ సీఐ రాజారెడ్డి, రెండో పట్టణ సీఐ ఇబ్రహీం. వివరాల్లోకి వెళితే...

ree
సమావేశంలో మాట్లాడుతున్న ఏఎస్పి ప్రేరణకుమార్ ఐపీఎస్

ఇంట్లో గొడవపడి ఆశ్రయం కోసం స్నేహితుడి ఇంటి వద్దకు వెళితే అదే స్నేహితుడి చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో వెలుగు చూసింది. ప్రొద్దుటూరులోని బొల్లవరం వీధిలో నివాసం ఉంటున్న సతీష్(46) గత నెల 15వ తేదీన కుటుంబ సభ్యులతో గొడవపడి ప్రొద్దుటూరు లోని పెన్నా నగర్ లో నివాసం ఉంటున్న బాల్య స్నేహితుడు కిషోర్ ఇంటికి వెళ్ళాడు .ఒంటరిగా ఉంటున్న కిషోర్ తన స్నేహితుడు సతీష్ తో కలిసి ప్రతిరోజు ఇంట్లోనే మద్యం సేవించేవారు. అయితే గత నెల 24వ తేదీన మద్యం కు డబ్బులు ఇచ్చే విషయమై కిషోర్ సతీష్ ల మధ్య పెద్ద గొడవ చోటుచేసుకుంది. గొడవ అనంతరం మద్యం మత్తులో పడి ఉన్న సతీష్ ను కిషోర్ కత్తితో 8సార్లు దారుణంగా పొడవడంతో సతీష్ అక్కడికక్కడే మరణించాడు. అనంతరం కిషోర్ సతీష్ మృతదేహాన్ని ఇంట్లోనే ఒక మూలకు చేర్చి దానిపై మట్టితో మృతదేహాన్ని కప్పి పెట్టాడు. ఈ విధంగా 37 రోజులు కిషోర్ మృతదేహంతో ఒకే ఇంట్లో కలిసి ఉన్నాడు. అయితే హైదరాబాదులో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కిషోర్ తల్లి వృద్ధాప్య పింఛన్ తీసుకోవడానికి ప్రొద్దుటూరులోని ఇంటికి రాగా ఇంటినిండా దుర్వాసన రావడంతో కిషోర్ ను తల్లి నిలదీసి అడిగింది. దీంతో జరిగిన విషయాన్ని కిషోర్ తల్లికి చెప్పడంతో కిషోర్ తల్లి ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులకు జరిగిన సమాచారాన్ని తెలియపరిచింది. దీనితో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కిషోర్ ను అదుపులోకి తీసుకొని విచారించి నేడు అరెస్టు చూపించారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page