ఓవర్ టేక్ ఒకరి ప్రాణం తీసింది.
- PRASANNA ANDHRA

- Oct 20, 2022
- 1 min read
Updated: Oct 21, 2022

వాహనాన్ని దాటాలనే ఉత్సాహంతో వేగాన్ని పెంచి.
ఓవర్ టేక్ ఒకరి ప్రాణం తీసింది.
నిత్యం రోజు రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నా, వాహనదారుల్లో అలసత్వం కనిపిస్తూనే ఉంది. రోడ్డుపై వెళ్తూ విన్యాసాలు చేయడం, వాహనాలను దాటాలనే ఉత్సాహంతో వేగాన్ని పెంచి నియంత్రణ కోల్పోయి ప్రమాదాలకు కారకులవుతున్నారు. ఇతరుల జీవితలను సైతం ప్రమాదంలోకి నెట్టివేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఏపీలోని ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరు వద్ద చోటుచేసుకుంది. ముందు వెళుతున్న బొలెరో వాహనాన్ని అధిగమించబోయి పక్కన ఉన్న డివైడర్ను ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముందు వెళుతున్న మరో ద్విచక్ర వాహనదారుడు సైతం తీవ్ర గాయాలపాలైయ్యాడు. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరినీ చికిత్స నిమిత్తం మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. ఈ ప్రమాదం విజువల్స్ సీసీ కెమెరాలో నమోదయ్యాయి.









Comments