అద్దంకి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
- PRASANNA ANDHRA

- Jan 3, 2022
- 1 min read
గుంటూరు జిల్లా నకరికల్లు అడ్డరోడ్డు సమీపంలో నార్కట్ పల్లి - అద్దంకి హైవేపై రోడ్డుప్రమాదం. ఎదురెదురుగా వస్తూ టెంపోట్రావెలర్ వ్యాన్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ఘటనలో టెంపోట్రావెలర్ వ్యాన్ లోని పలువురికి గాయాలు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించిన బంధువులు. నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ముగ్గురు క్షతగాత్రులు. గాయాలైన క్షతగాత్రులు వరంగల్, హన్మకొండ కు చెందిన వారుగా గుర్తింపు. క్షతగాత్రులు తిరుపతి వెళ్లివస్తుండగా జరిగిన ఘటన.










Comments