top of page

ఓబులవారిపల్లి క్రాస్ వద్ద బైకు లారీ డీ వ్యక్తి మృతి

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • May 29, 2022
  • 1 min read

ప్రమాదాలకు నెలవు ఈ రోడ్డు. ఓబులవారిపల్లి క్రాస్ వద్ద బైకు లారీ డీ వ్యక్తి మృతి - మృతుడు ముక్కవారిపల్లి అరుంధతి వాడకు చెందిన దగ్గొలు బాబు గా గుర్తింపు.

ree

గాలిలో కలుస్తున్న ప్రాణాలు- నిరాశ్రయులు అవుతున్న కుటుంబాలు

ree

చిన్నపాటి వాహనదారులు ఎంతటి జాగ్రత్తగా వాహనాలు నడుపుతున్న.. భారీ వాహనదారులు సుదూర ప్రాంతాలకు చేరుకునే ప్రయత్నంలో గమ్యాన్ని మాత్రమే ఆలోచిస్తూ జాగ్రత్తలు పాటించక నిద్రలేమి, అతివేగం కారణంతో ముఖ్యంగా కాలినడకన నడిచేవారు,ద్విచక్ర వాహనదారులు మరియు చిన్నపాటి వాహనాల పాలిట భారీ వాహనాలు మృతి శకటాలుగా మారాయి.

ree

వివరాల్లోకి వెళితే కడప తిరుపతి హైవే రహదారి కావడంతో కన్నుమూసి తెరిచేలోగా పదుల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తుంటాయి. అయితే ఎంతో జాగ్రత్తగా చిన్న వాహనదారులు ప్రయాణం చేస్తున్నప్పటి కీ భారీ వాహనదారులు మాత్రం ఇష్టారీతిన ఏది జరిగినా మాకు ఏమీ కాదు కదా..?? అన్నట్లు ప్రయాణిస్తూ అమాయకుల ప్రాణాలు తీస్తూ బాధిత కుటుంబాలను అనాధలను చేస్తున్నారు అన్నది ముమ్మాటికి నిజం.


నిఘా వ్యవస్థ ఏమైనట్టు : అడుగడుగునా నిఘా కెమెరాలు,స్పీడ్ బ్రేకర్లు, పెట్రోలింగ్ వాహనాలు, అధికారులు ఇలా ఎన్ని ఉన్నప్పటికీ భారీ వాహనాల వేగానికి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ఈ రహదారి వెంబడి ప్రతి వారం ఎవరో ఒక ప్రాణం గాలిలో కలిసిపోతుంది అన్నది వాస్తవం.


ఈ రోజున ఓబులవారిపల్లి క్రాస్ వద్ద ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ముక్కా వారి పల్లి అరుంధతీవాడ కు చెందిన దగ్గొలు బాబు అనే వ్యక్తి ని TN 52 E5658 అనే వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందవలసి ఉంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page