మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు
- EDITOR

- Apr 15, 2023
- 1 min read
మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు


ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రకాష్ ఏజెన్సీస్ సౌజన్యంతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద శనివారం మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకొని ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని., వివిధ అవసరాల రీత్యా మండలంలోని చుట్టుపక్కల గ్రామాల వారు పట్టణానికి వస్తుంటారని, అలాంటి వారికి మజ్జిగ చలివేంద్రం ఉపయుక్తంగా ఉంటుందన్న ఉద్దేశంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీ ఆర్యవైశ్య సంఘం, శ్రీ రాఘవేంద్ర వైశ్య యూత్ అసోసియేషన్ సంఘం, శ్రీ ఆర్యవైశ్య యువజన సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.










Comments