top of page

నోటితో గీసిన చిత్రానికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్

  • Writer: MD & CEO
    MD & CEO
  • Feb 18, 2022
  • 2 min read


వినుకొండ ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, ఆంగోతు సోమ్లా నాయక్, గుంటూరు జిల్లా, బొల్లాపల్లి, చక్రాయపాలెం లోని ఒక పేద కుటుంబంలో జన్మించాడు, చిన్నప్పటినుండి ఎన్నో ఆశలు కోరికలు ఏదయినా కొత్తగా ఆలోచించి పదిమందికి తెలియచేయాలి అనే తపన, తనను తాను నిరూపించుకోవాలని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు గౌరవం ఉండాలని, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పుట్టిన ఊరికి గొప్ప పేరు తీసుకురావాలని ఎప్పుడూ అనుకునేవాడు. అనుకున్నదే తడువుగా తన ఆలోచనలకు పదును పెట్టాడు ఆంగోతు సోమ్లా నాయక్ అదే మౌత్ ఆర్ట్.


మౌత్ మరియు ఫుట్ పెయింటింగ్ అనేది నోరు లేదా పాదంతో బ్రష్‌లు మరియు ఇతర సాధనాలను ఉపయోగించి డ్రాయింగ్‌లు, పెయింటింగ్‌లు మరియు ఇతర కళాకృతులను రూపొందించే సాంకేతికత. అనారోగ్యం, ప్రమాదం లేదా పుట్టుకతో వచ్చే వైకల్యం కారణంగా తమ చేతులను ఉపయోగించని కళాకారులచే ఈ సాంకేతికత ఎక్కువగా ఉపయోగించబడుతుంది. అసోసియేషన్ ఆఫ్ మౌత్ అండ్ ఫుట్ పెయింటింగ్ ఆర్టిస్ట్స్ (AMFPA) ఈ కళాకారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రపంచవ్యాప్త సంస్థ.

వీరు ఉపయోగించే బ్రష్‌లు మరియు సాధనాలు సాధారణ కళాకారుల పనిముట్లు, కానీ అవి పొడవు లేదా వెడల్పులో సవరించబడవచ్చు. మౌత్ పెయింటర్లు తమ నోటిలో లేదా దంతాల మధ్య బ్రష్‌ను పట్టుకుని, వారి నాలుక మరియు చెంప కండరాలతో పెయింట్ వేసే సమయంలో బ్రష్ కదలికలు చేస్తారు. కాగితం లేదా కాన్వాస్ సాధారణంగా ఈసెల్‌పై నిలువుగా అమర్చబడి ఉంటుంది. మెడ మరియు దవడ కండరాలకు మౌత్ పెయింటింగ్ చాలా శ్రమతో కూడుకున్నది, ఎందుకంటే పెయింటింగ్ చేసేటప్పుడు తలపై చేయి చేసే విధంగానే ముందుకు వెనుకకు కదలిక ఉంటుంది.


అలాంటి కళనే ఆంగోతు సోమ్లా నాయక్ ఎంచుకున్నాడు, రేయింపవళ్ళు అనుకున్న ఆశయం కల నెరవేరటానికి కృషి సాధన చేసాడు, తాను అనుకున్న కళలో ప్రావీణ్యత సాధించాడు, పరమేశ్వరుని చిత్రాన్ని తన నోటి ద్వారా పెయింటింగ్ వేయటం ప్రారంభించాడు, అలా చిన్నగా తన కళకు పదును పెట్టి నేడు నలబై నిమిషాల్లో ఆ పరమ శివుని చిత్రాన్ని చిత్రంగా చిత్రీకరించి పలువురి మన్ననలు పొందాడు సోమ్లా నాయక్, ఇది సామాజిక మాధ్యమాల ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థకు చేరింది. సోమ్లా నాయక్ కళను గుర్తించిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు, ఇతనికి ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్ లో స్థానం కల్పించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్న సోమ్లా నాయక్ ఆనందానికి అవధులు లేవు.

ree

కానీ, తనను ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం గుర్తించక పోవటం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు సోమ్లా నాయక్, ఏది ఏమయినప్పటికీ ఇలాంటి కళాకారులను ప్రభుత్వం గుర్తించి తగు రీతిన సత్కరించవలసిన ఆవశ్యకత ఎంతయినా ఉంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page