top of page

చిన్న పక్షి తన జాతిని పెంచుకోడానికి

  • Writer: EDITOR
    EDITOR
  • Apr 15, 2023
  • 1 min read

చిన్న పక్షి తన జాతిని పెంచుకోడానికి

ree

అర్జెంటినా నుండి బార్న్ స్వాలొ అనే ఆరు ఇంచెలు ఉండే చిన్న పక్షి తన జాతిని పెంచుకోడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో 8300 కి.మి ప్రయాణం చేసి మార్చ్ నెల చివరికల్లా కాలిఫోర్నియా చేరుకుని అక్కడే నివాసం ఏర్పరుచుకుంటాయి. రోజుకి సగటున 950 కి.మి ప్రయాణం చేయగలవు.తన వంశాన్ని వృద్ధి చేసుకుని అక్టోబర్‌లో తన పిల్లలతో తిరుగు ప్రయాణం చేస్తాయి.

ree

ఇందులో వింత ఏముంది అంటారా…


కానీ అవి దాదాపుగా 16600 కి.మి ప్రయాణం చేస్తాయి ప్రయాణం చేస్తున్న మార్గంలో ఎక్కడా కూడా ఒక్క అడుగు భూమి కనిపించదు మొత్తం ప్రయాణం అంత సముద్రమార్గానే సాగుతుంది.


అందుకే అవి అర్జెంటీనాలో బయల్దేరే ముందు,ఒక చిన్న పుల్లను వాటి సహాయార్థం తీసుకుంటాయి.అవి అలసిపోయినప్పుడు,ఆకలివేసినప్పుడు,ఆ పుల్లను నీటిపైన వేసుకుని సేద తీరుతాయి అలాగే దొరికిన ఆహారంతో ఆకలి తీర్చుకుని మళ్ళి ప్రయాణం మొదలెడతాయి.

ree

ఇలా ఒక చిన్న పుల్ల ఆధారంతో చిన్న పక్షి అంత అంత దూరం ప్రయాణం చేయగలుగుతుంది అంటే అవి వాటిపైన పెట్టుకున్న నమ్మకం,పట్టుదల.


చిన్న పక్షులు వాటికే వాటిపైన అంత నమ్మకం ఉన్నప్పుడు దేవుడు మనకు అన్ని అవయవాలు ఇచ్చాడు అపార మెధోసంపత్తినిచ్చాడు మన మీద మనకు ఇంకెంత నమ్మకం ఉండాలి,ఇంకెంత పట్టుదల ఉండాలి…!

ree

ప్రయత్నిద్దాం ఓడిపోతే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిద్దాం సాధించలేనిది ఏది లేదు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page