రాస్ - రాష్ట్రీయ సేవ సమితి కార్యక్రమంలో MLA తనయుడు
- PRASANNA ANDHRA

- Jan 6, 2022
- 1 min read
రాష్ట్రీయ సేవ సమితి - రాస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ డా౹౹ గుత్తు మునిరత్నం 87వ జన్మదిన సందర్భంగా శ్రీకాళహస్తి రాస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమారుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి. ఆకర్ష్ రెడ్డి మాట్లాడుతూ మునిరత్నం ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని, వారు నిర్వర్తించిన సేవ కార్యక్రమలకు 4 జాతీయ అవార్డు లతో పాటు పద్మశ్రీ అవార్డ్ ఇతర అవార్డ్ లను అందుకోవడం అయ్యింది అని తెలిపారు. రాస్ సంస్థ సేవ కార్యక్రమలకు ఎమ్మెల్యే సహాయ సహకారాలు ఉంటాయి అని తెలిపారు.
అనంతరం నిరుపేదలకు నిత్యవసర వస్తువులైన బియ్యం,కందిపప్పు, నూనె, సాల్ట్ ప్యాకెట్ ను పంపిణీ చేయడమైనది.
టైలరింగ్ నందు శిక్షణ పొందిన 60 మంది మహిళలకు రాస్ జన శిక్షణ సంస్థ, స్కిల్ ఇండియా కేంద్ర ప్రభుత్వం వారికి సంబంధించిన సర్టిఫికెట్లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ మేనేజర్ లోకేష్, ప్రముఖ న్యాయవాది భక్తవత్సల, అవధూత మాసపత్రిక సంపాదకులు ఆనంద్ రెడ్డి, రాస్ బాలాజీ రెడ్డి మరియు రాస్ నిర్వహకులు పాల్గొన్నారు.
















Comments