top of page

ఘనంగా జాప్ 33 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Nov 19
  • 1 min read

ఘనంగా జాప్ 33 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ree

విశ్వభారతి అంధుల పాఠశాలలో సంబరాలు


విద్యార్థుల చేత కేక్ కట్ చేపించిన జర్నలిస్టులు


జర్నలిస్టులకు జాప్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్న నేతలు


జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (జాప్) 33 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నెల్లూరులో ఘనంగా జరిగాయి. నగరంలోని దర్గామిట్టలో ఉన్న విశ్వభారతి అందులో పాఠశాలలో విద్యార్థుల చేత కేక్ కట్ చేపించి సంబరాలు చేసుకున్నారు జాప్ అసోసియేషన్ నేతలు..ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. జాప్ రాష్ట్ర అధ్యక్షులు రవితేజ, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ద్రోణాదుల నరేష్ కుమార్, చరిత్ర కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కారణి మురళీకృష్ణ తదితరులు విద్యార్థులతో కలిసి ఈ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ 33 సంవత్సరాల క్రితం జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ను వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పల లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారని, అప్పటి నుంచి రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై జాప్ ఎల్లప్పుడు పోరాటాలు చేస్తుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 33 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయని, ప్రతి నియోజకవర్గంలోనూ ఈ కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించినట్లు వెల్లడించారు. అందుల పాఠశాలలో పిల్లలతో కలిసి సంబరాలు చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలో అక్రిడేషన్లు రాబోతున్నాయని, అక్రిడేషన్ల కమిటీలో జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున సభ్యులు ఉంటారని, ప్రతి ఒక్క జర్నలిస్టుకు అక్రిడేషన్లు వచ్చేలా చూస్తామని తెలిపారు. అలానే ప్రతి జర్నలిస్టుకు సొంతింటి కల నెరవేరేలా ప్రభుత్వంతో చర్చించి ఇళ్ల స్థలాలు వచ్చేలా చూస్తామని చెప్పారు. ఇప్పటికే అందుకు సంబంధించి అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, సమాచార శాఖ మంత్రి, కమిషనర్ తో అనేకమార్లు చర్చించామని చెప్పారు. ఇటీవలి కాలంలో సమాచార శాఖ కమిషనర్ ని కలిసి జర్నలిస్టుల సమస్యలపై మాట్లాడమన్నారు. అలానే ఇటీవల చిత్తూరు జిల్లాలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయని, అత్యంత త్వరలో నెల్లూరు జిల్లాలోనూ రాష్ట్ర మహాసభలను నిర్వహించబోతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సభ్యులు మధు, వెంకయ్య, నరసింహులు, సనావుల్లా, నజీర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page