9 మంది జూదరులు అరెస్ట్
- EDITOR

- 6 days ago
- 1 min read
9 మంది జూదరులు అరెస్ట్

వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఈరోజు ప్రొద్దుటూరు పట్టణం, వివేకానంద క్లాత్ మార్కెట్ ముళ్ళ పొదల వెనుక వైపు 9 మంది జూదురులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 84,000/- రూపాయల నగదు, 8 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ సదాశివయ్య పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. వీరిపై Cr.No:367/2025 U/s 9 (1) AP గేమింగ్ (గ్యాంబ్లింగ్) యాక్ట్ ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అరెస్టు అయినవారిలో ప్రొద్దుటూరు పట్టణం ప్రకాష్ నగర్ కు చెందిన షేక్ మాబు హుస్సేన్ (కట్టుబడి మాబు హుస్సేన్), అల్లుట్ల విశ్వనాథ్, అల్లుట్ల శ్రీనివాసులు, రాజశేఖర్, శివశంకర్, బాలాజీ, మహమ్మద్, వెంకటేశ్వర్లు మరియు మాబు షరీఫ్ ఉన్నారన్నారు.








Comments