8వ వార్డు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ
- PRASANNA ANDHRA

- Jan 22, 2022
- 1 min read
కడప జిల్లా, ప్రొద్దుటూరు 8వ వార్డ్ నందు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసిన స్థానిక MLA రచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ 8వ వార్డు నందు రోడ్డుకు ఇరువైపులా 400 మీటర్ల మేర మురికి కాలువలు, సిమెంట్ రోడ్డు నిర్మాణము 38.5 లక్షల మునిసిపల్ నిధులతో నిర్మాణము చేపట్టామని, గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడి ప్రజలు మురికి నీటి కాలువలు లేక అపరిశుభ్రత వలన తీవ్ర ఇబ్బందులు పడ్డారని వైసీపీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు, కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, మునిసిపల్ చైర్మన్, స్థానిక వార్డు కౌన్సిలర్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











Comments