రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల
- PRASANNA ANDHRA

- Nov 26, 2024
- 1 min read
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన కాంగ్రెస్ నాయకులు
భారత రాజ్యాంగానికి 75 ఏళ్లు
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నవంబర్ 26 మంగళవారం స్థానిక మైదుకూరు రోడ్డులోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన ప్రొద్దుటూరు కాంగ్రెస్ నాయకులు.
ఈ సందర్భంగా ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్, 13వ వార్డు కౌన్సిలర్ సకిలగిరి ఇర్ఫాన్ భాష మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని పరిరక్షించే విధంగా ఉండాలి కానీ భక్షించే విధంగా ఉండకూడదని, దేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించేది ఒక్క కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణకు తూట్లు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ రాజ్యాంగ పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత అని గుర్తు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గోసంగి సుబ్బారెడ్డి, పలువురు క్రియాశీలక కార్యకర్తలు పాల్గొన్నారు.








Comments