సెరవేగంగా మునిసిపల్ అభివృద్ధి పనులు
- PRASANNA ANDHRA

- Feb 14, 2022
- 1 min read
కడప జిల్లా, ప్రొద్దుటూరు మునిసిపల్ పరిధిలోని స్థానిక 4వ వార్డు సున్నంబట్టీల వీధిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు MLA రచమల్లు శివప్రసాద్ రెడ్డి నేడు భూమి పూజ నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అభివృద్ధి పనులలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని వివిధ వార్డుల యందు అభివృద్ధి పనులు చేపట్టామని, అందులో భాగంగానే 4వ వార్డులో నేడు పది లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టామని. మౌలిక వసతుల కల్పనలో తమ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని తెలియజేసారు, అలాగే సున్నంబట్టి వీధి పేరును మార్చాలని ఆ వార్డు కౌన్సిలర్ వరికూటి ఓబులరెడ్డి, వార్డు ప్రజలు కోరగా త్వరలో వార్డు ప్రజల నిర్ణయం మేరకు సూచనలు సలహాలు తీసుకొని కౌన్సిల్ నందు ఆమోదం తెలుపుతామని, త్వరలో వీధి పేరు మార్చనున్నట్లు తెలియజేశారు.









Comments