కడలి కల్లోలానికి నేటికి 45 ఏళ్లు
- PRASANNA ANDHRA

- Nov 19, 2022
- 1 min read
కడలి కల్లోలానికి నేటికి 45 ఏళ్లు
నేడు దివిసీమ ను ఉప్పెన చుట్టు ముట్టిన రోజు
నాటి సంఘటన తలుచుకుంటేనే దివిసీమ ప్రజలకు ఉలిక్కిపాటు .
1977 నవంబరు 19న సంభవించిన ఉప్పెన దివిసీమ లో 30 వేల మందిని పొట్టన పెట్టుకుంది. ఆ ఘోర కలికి నేటితో 45 ఏళ్లు నిండిపోయి. అయినప్పటికీ దివి వాసుల గుండెల్లో నేటికీ ఆ రోజును తలచుకుంటే వణుకు పుడుతుంది. దివిసీమ ఉప్పెన కంటే ముందే ప్రతి వందే ళ్లకోసారి కృష్ణ తీరప్రాంతాన్ని ఉప్పెనలు ముంచెత్తాయి. గడచిన నాలుగు శతాబ్దాలలో నాలుగు పర్యాయాలుగా సంభవించిన ఉప్పెనలు దాదాపుగా లక్ష మందిని పొట్టన పెట్టుకున్నాయి .
శతాబ్దాలుగా జలప్రళయాలకు నిలయం కృష్ణాతీరం కానవస్తుంది.
1977 నవంబర్ 19న దివిసీమ ను జల ప్రళయం కాటేసిన రోజు. ఆ రోజు ఉదయం నుంచే మొదలైన వర్షం దివిసీమ ను తడిపి ముద్ద చేసింది. రాత్రికి తీవ్రరూపం దాల్చి ఉప్పెనలా తీరప్రాంతం పైదండెత్తింది .దాదాపు తాటి చెట్టు ఎత్తున ఎగసిపడిన సముద్రపు అలలు దివిసీమ లోని సముద్ర తీర ప్రాంత గ్రామాలను మింగేశాయి.
ఈ ఘోర విపత్తు లో పదివేల మంది జలసమాధి అయ్యారు. అప్పట్లో కమ్యూనికేషన్ వ్యవస్థ బలంగా లేకపోవడంతో పొంచి ఉన్న ప్రమాదాన్ని ప్రభుత్వ యంత్రాంగం ముందుగా కనిపెట్టలేకపోయింది .








Comments