top of page

ఆ నలుగురు విలేకరులు బెదిరింపులకు పాల్పడ్డారు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Apr 5, 2022
  • 1 min read

ree

కృష్ణాజిల్లా, 04.04.2022 వ తేది సాయంత్రం సుమారు 05.00 గంటల సమయంలో ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామ పెద్ద చెరువులో అమర్తల శ్రీనివాసరావు తండ్రి సామిఏలు అను అతను రెవిన్యూ వారి పర్మిషన్ తో మట్టిని త్రోలుచుండగా AP 05 BD 4142 నెంబర్ గల ఇండికా కార్ లో నలుగురు వ్యక్తులు వచ్చి మేము విలేకరులము మీరు అక్రమంగా మట్టి త్రోలుచున్నారు మాకు 8000/-లు ఇవ్వండి లేకపోతే మా ఛానల్ లో స్కోలింగ్ వేస్తాము అని బెదిరించి, సామిఏలు వద్ద నుండి 4000/- లు బలవంతంగా లాక్కొని పారిపోయినారు అనే విషయంపై రిపోర్ట్ ఇవ్వగా దానిపై CrNO 111/2022 U/s 384 IPC గా కేసు నమోదు చేసి దర్యాప్తులో బాగంగా ఈ రోజు అనగా 05.04.2022 వ తేదిన సదరు నలుగురు వ్యక్తులు

1. చింతపల్లి శ్రీనివాసరావు తండ్రి రామాంజనేయ, 53సం.లు, మాదేపల్లి గ్రామం, ఏలూరు.


2. సున్న సుదీర్ తండ్రి నరేంద్ర రావు, 40 సం.లు, దెందులూరు,


3. మురపు రవి కుమార్ తండ్రి నాగేశ్వరరావు, 32 సం.లు, భీమడోలు గ్రామం, గుండుగొలను మండలం.


4. కడలి శ్యామ్ ప్రసాద్ తండ్రి రామారావు, 40 సం.లు, తూర్పు వీది. ఏలూరు.


అనువారలను స్టేషన్ కు పిలిపించి వారికి 41(A) CrPC నోటీసు సర్వ్ చేయడమైనదని ఇన్స్పెక్టర్ తెలియచేశారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page