38వ వార్డులో రెండవరోజు గడప గడప
- PRASANNA ANDHRA

- Sep 21, 2022
- 1 min read
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు

బుధవారం సాయంత్రం గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరు నియోజకవరగా వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి 38వ మునిసిపల్ వార్డు నందు రెండవ రోజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని, అందుకే పేద మధ్యతరగతి ప్రజలకు ఆర్ధిక భరోసా కల్పిస్తూ జగన్ ప్రభుత్వం సంక్షేమ పధకాలు అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో 2024వ సంవత్సరంలో తిరిగి అధికారం చేపట్టబోయేది జగన్ మోహన్ రెడ్డే అని ధీమా వ్వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు కామిశెట్టి బాబు, వైసిపి రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు కాకర్ల నాగ శేషారెడ్డి, వైసిపి కౌన్సిలర్లు భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి, పిట్ట బాలాజీ, అనిల్ కుమార్, యాల్లాల మహమ్మద్ గౌస్, షేక్ కమల్ భాష, గరిశపాటి లక్ష్మీదేవి, ఇర్ఫాన్ భాష, బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ రసపుత్ర రజిని, రాగా నరసింహారావు, టీటీడీ పాలక మండలి సభ్యులు మారుతి ప్రసాద్, వైసిపి నాయకులు 40 ఇంచార్జ్ రావులకొల్లు నాగేంద్ర, అగ్గరపు శ్రీనివాసులు, రామ్మోహన్ రెడ్డి, రాయపు రెడ్డి, కంభం పాములేటి, డీలర్ ఆంజనేయులు, ఆచారి కాలని శివారెడ్డి, సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.








Comments