35వ వార్డులో గడప గడపకు 76వ రోజు
- PRASANNA ANDHRA

- Sep 1, 2022
- 1 min read
పేదవారికి ఆర్థిక భరోసా కల్పించడమే జగన్ లక్ష్యం - ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
రాష్ట్రంలోని వివిధ సంక్షేమ పథకాల ద్వారా నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే జగన్ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక 35వ వార్డు కౌన్సిలర్ పిట్టా బాలాజీ, పిట్టా భద్రమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వార్డులో ఇంటింటికి తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు తీరును అభివృద్ధి కార్యక్రమాల పై స్పందన ఆయన ప్రజలను అడిగి తెలుసుకున్నారు, ప్రతి పేదవానికి సంక్షేమ పథకాల తో ఆర్థిక భరోసా కల్పిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలందరినీ సమానంగా చూస్తూ వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు, ప్రజలకు ఇన్ని మేలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ ను ఆశీర్వదించాలని ఈ సందర్బంగా ఆయన కోరారు. అనంతరం జీవనజ్యోతి హై స్కూల్ నందు ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు హాజరయి, స్కూల్ కరెస్పాండెంట్ అమరనాథ్ రెడ్డి, గురుదేవ్ రామిరెడ్డి తో కాసేపు ముచ్చటించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, వైసీపీ పట్టణాధ్యక్షుడు కామిశెట్టి బాబు, వైసీపీ సీనియర్ నాయకులు కాకర్ల నాగ శేషారెడ్డి, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ జింకా విజయలక్ష్మి, కౌన్సిలర్లు గరిసపాటి లక్ష్మి దేవి, వరికూటి ఓబుల్ రెడ్డి, ఇర్ఫాన్ భాష, కమల్ భాష, వైసీపీ నాయకులు స్నూకర్ భాస్కర్, ఎద్దుల రాయపరెడ్డి, 35వ వార్డు వైసీపీ నాయకులు, ఆ వార్డు ప్రజలు పెద్దఎత్తున్న పాల్గొన్నారు.














Comments