31వ వార్డులో గడప గడపకు వైసీపీ ప్రభుత్వం
- PRASANNA ANDHRA

- May 26, 2022
- 1 min read
31వ వార్డులో గడప గడపకు వైసీపీ ప్రభుత్వం
వై.ఎస్.ఆర్ జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం చేపట్టిన 'గడప గడపకు మన ప్రభుత్వం' లో భాగంగా నేడు ప్రొద్దుటూరు 31వ వార్డు వసంతపేటలో ఎమ్మెల్యే రచమల్లు శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన వార్డులోని ప్రజలతో అక్కడి సమస్యలు అడిగి తెలుకున్నారు, ప్రజలతో మమేకమై అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. వసంతపేటలోని పోరుమామిళ్ల గురు స్వామి (గురు) ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే రాచమల్లు వసంతపేటలో నూతనంగా నిర్మించిన గురు ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే రాచమల్లు తేనేటి విందులో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాచమల్లు, మునిసిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, వార్డు కౌన్సిలర్ లక్ష్మిదేవి ఆమె భర్త చిన్న రాజా, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డులోని ప్రజలు పాల్గొన్నారు.









Comments