top of page

పేదలకు భరోసా ఇస్తున్న ప్రభుత్వమిది - రాచమల్లు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Aug 22, 2022
  • 1 min read

పేదలకు భరోసా ఇస్తున్న ప్రభుత్వమిది


– సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో సంతోషం

– ఒక్కో కుటుంబానికి రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు లబ్ధి

– మునిసిపాలిటీలో అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళతాం

– ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు స్పష్టీకరణ

– 30వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం

ree

ప్రొద్దుటూరు ఆగష్టు 22, ప్రసన్న ఆంధ్ర


పేదలకు భరోసా ఇస్తున్న ప్రభుత్వం తమదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించగలుగుతున్నామని తెలిపారు. సోమవారం నియోజకవర్గ పరిధిలోని 30వ వార్డు మునిసిపల్ కౌన్సిలర్ మీగడ దీప్తి ఆమె భర్త మీగడ చంద్ర శేఖర్ రెడ్డిలతో కలిసి నాలుగవ రోజు ‘గడప గడపకు మన ప్రభుత్వం’ నిర్వహించారు. సాయంత్రం 4:30 గంటల నుంచి రాత్రి 07:00 గంటల వరకు దాదాపు వార్డులోని అన్ని కుటుంబాలను నేరుగా కలుసుకున్నారు. ఆయా కుటుంబాలకు మూడేళ్లుగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిని వివరించారు. స్థానికంగా పెద్దలు చిన్నారులతో కాసేపు ముచ్చటించారు.

కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ నాయకులు, 30వ వార్డు ప్రజలు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page