మరో ముగ్గురు కౌన్సిలర్లు టిడిపి గూటికి
- PRASANNA ANDHRA

- Aug 3, 2024
- 1 min read
మరో ముగ్గురు కౌన్సిలర్లు టిడిపి గూటికి

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
శుక్రవారం నలుగురు వైసిపి కౌన్సిలర్లు టిడిపి తీర్థం పుచ్చుకోగా, శనివారం ఉదయం మరో ముగ్గురు వైసిపి కౌన్సిలర్లను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి స్వయానా వారి ఇంటి వద్దకు వెళ్లి పార్టీ కండువా కప్పి టిడిపిలోకి సాదరంగా ఆహ్వానించారు. నేడు టిడిపి గూటికి చేరిన వారిలో 21 వ వార్డుకు చెందిన కొవ్వూరు స్వాతి, 16వ వార్డుకు చెందిన మోపురి రేవతి, 36 వార్డుకు చెందిన అలవలపాటి అరుణ ఉన్నారు. టిడిపి ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు, వార్డుల అభివృద్ధి, నియోజకవర్గంలో శాంతియుత వాతావరణం నెలకొల్పటం కొరకు తాము టిడిపిలో చేరినట్లు కౌన్సిలర్లు తెలిపారు.










Good decission