జూదరులు అరెస్ట్ భారీగా డబ్బు స్వాధీనం
- PRASANNA ANDHRA

- Oct 24, 2023
- 1 min read
26 మంది జూదరులు అరెస్ట్
భారీగా డబ్బు స్వాధీనం


కడప జిల్లా, ప్రొద్దుటూరు గోపవరం పంచాయతి పరిధిలోని ఇంద్రసేనారెడ్డి అనే వ్యక్తి తన ఇంటిలో చట్టవ్యతిరేకమైన మంగతయి ఆడుతుండగా యస్.ఈ.బి అలాగే రూరల్ పోలీసులు ఆకస్మిక మెరుపు దాడి చేసి 26 మందిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారని మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఏ.ఎస్.పి ప్రేరణ కుమార్ ఐపీఎస్ వెల్లడించారు . అరెస్ట్ అయిన వారి వద్ద నుండి 14 లక్షల 66 వేల రూపాయలు, అలాగే 52 ఇస్పేటాకులు స్వాధీనం చేసుకొని వాటిని సీజ్ చేశారు. చట్టవ్యతిరేకమైన చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ ప్రేరణ కుమార్ హెచ్చరించారు.









Comments