19వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం
- PRASANNA ANDHRA

- Jun 18, 2022
- 1 min read
Advertisement : ప్రొద్దుటూరులో ఇంటి స్థలాలు / ఫ్లాట్స్ అమ్మాలన్నా కొనుగోలు చేయాలన్నా సంప్రదించండి - 9912324365
* - * - * - * - *
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
వైసీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా నేడు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మునిసిపల్ పరిధిలోని పంతొమ్మిదవ వార్డులో పర్యటించారు. ఆ వార్డు కౌన్సిలర్ షేక్ మునీర్ ఆధ్వర్యంలో రెండు రోజులు పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాచమల్లు గడప గడపకు వెళ్లి అక్కడి లభ్డిదారులను, ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాను రెండవసారి ఎమ్మెల్యే గా పోటీ చేసినప్పటి జ్ఞాపకాలను అక్కడి వృద్ధురాలికి గుర్తు చేసి, నేను ఇదే అరుగు మీద కూర్చొని ఆరోజు నిన్ను ఓటు అడిగాను తల్లి అని గుర్తు చేశారు.
వార్డులో దాదాపు ఏడు వందల డెభై నాలుగు మంది లబ్ధిదారులకు వివిధ సంక్షేమ పధకాలు అమలు కాగా దాదాపు నాలుగు కోట్ల ఎనబై ఆరు లక్షల రూపాయల నిధులు లబ్ధిదారుల కాతాలలో జమయినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాచమల్లు, మునిసిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి, 19వ వార్డు కౌన్సిలర్ షేక్ మునీర్, కౌన్సిలర్లు మహమ్మద్ గౌస్, గరిశపాటి లక్ష్మిదేవి, జిలాన్, కమాల్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డులోని ప్రజలు పాల్గొన్నారు.














Comments