సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత - రాచమల్లు
- PRASANNA ANDHRA

- Oct 29, 2022
- 1 min read

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా, మూడవ రోజు శనివారం ఉదయం మున్సిపల్ 17వ వార్డు కౌన్సిలర్ చింతకుంట సరితా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా, ప్రొద్దుటూరు నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వార్డులో గడప గడపకు తిరిగి వార్డులోని ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలు తీరుతెన్ను అడిగి తెలుసుకుని, సచివాలయ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు.

అనంతరం ప్రముఖ వ్యాపారవేత్త వేంపల్లి అశోక్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే రాచమల్లు ను తేనేటి విందుకు ఆహ్వానించగా, ఎమ్మెల్యే రాచమల్లు తేనేటి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, వార్డులోని పలు సమస్యలపై దృష్టి సారించి త్వరితగతిన పనులు పూర్తి చేశామని, జగన్ ప్రభుత్వం అభివృద్ధి పనులకు, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసి ముందుకు సాగుతోందని, రాబోవు ఎన్నికల్లో జగన్ మరో మారు ముఖ్యమంత్రిగా మరిన్ని సంక్షేమ పథకాలు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డులోని ప్రజలు ఎమ్మెల్యే రాచమల్లు వెంట నడిచారు.








Comments