సంక్షేమ పథకాల ద్వారా పేదలకు ఆర్థిక భరోసా - ఎమ్మెల్యే రాచమల్లు
- PRASANNA ANDHRA

- Oct 22, 2022
- 1 min read

వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
పేద ప్రజలకు ఆర్థిక చేయూతను కల్పిస్తూ ఆపన్నహస్తం అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి పేదవాడు తన హృదయంలో పదిలం చేసుకోవడం తథ్యమని పేదల కన్నీరు తుడవడమే సీఎం ధ్యేయమని స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని 15వ వార్డులో కౌన్సిలర్ ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

అనంతరం పార్టీ నాయకులతో కలిసి వార్డులో గడపగడప పర్యటన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సమస్యలు ఏవైనా ఉంటే అక్కడికక్కడే పరిష్కరిస్తూ పట్టణంలో మురుగు నీటి వ్యవస్థ, మంచినీరు, విద్యుదీపాల పరిస్థితిని అడిగి తెలుసు కున్నారు. పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతను కల్పిస్తూ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీరు విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యతను కల్పించడం జరుగుతోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్దిపై ఆయన ఆరా తీశారు.









Comments