top of page

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కొరకు 'ప్రజా కౌన్సిల్' - కౌన్సిలర్ ఇర్ఫాన్ భాష

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Feb 2, 2024
  • 1 min read

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కొరకు 'ప్రజా కౌన్సిల్' - కౌన్సిలర్ ఇర్ఫాన్ భాష

ree
సమావేశంలో మాట్లాడుతున్న కౌన్సిలర్ ఇర్ఫాన్

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రజా సమస్యల అవగాహన, సత్వర పరిష్కార వేదికను 13వ వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్ భాష శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. ప్రజా కౌన్సిల్ పేరిట ఏర్పాటు చేసిన ఈ వేదికలో 13వ వార్డ్ ప్రజల సమస్యలు తెలుసుకుని సత్వర పరిష్కార దిశగా అడుగులు వేస్తామని ఇర్ఫాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్సిపల్ అధికారులు, పాలకమండలి ప్రజా సమస్యల పట్ల అలసత్వం ప్రదర్శిస్తోందని తన వార్డు నందు తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా వైస్ చైర్మన్ పర్యటించి ఇక్కడి సమస్యలు పరిష్కరిస్తానని, ప్రజలకు రోడ్లు మౌలిక వసతులు కల్పిస్తానని హామీ ఇవ్వడం సంతోషంగా ఉన్నప్పటికీ, తనకు కూడా పర్యటన వివరాలు తెలియచేయాలంటూ కోరారు. గతంలో వార్డులోని పలు మౌలిక వసతులు, సిసి రోడ్ల నిర్మాణం కొరకు మున్సిపల్ పాలకమండలికి, చైర్మన్, కమిషనర్లకు విన్నవించి ఉన్నానని, అయితే పాలకపక్ష నాయకులతో కలిసి ఉన్నప్పుడు జరగని అభివృద్ధి పనులు నేడు జరుగుతుండటం తాను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. 13వ వార్డు నందు ప్రజలకు ఏ అవసరం వచ్చినా తాను ముందుండి పని చేస్తానని, తనను చిన్నచూపు చూస్తున్న నేతలు తన వార్డు యందు పర్యటించటం సబబు కాదని అభివృద్ధి లో భాగంగా తనకు కూడా వివరాలు తెలియచేయాలని హితువు పలికారు. అలాగే 13వ వార్డు యందు ప్రజలకు హామీ ఇచ్చిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page