కలమల్ల గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి
- PRASANNA ANDHRA

- Apr 14, 2024
- 1 min read


ఆదివారం ఉదయం AP NCPS మరియు AP MCEF ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతిని కలమల్ల గ్రామంలోని దళితవాడ రామాలయం గుడి వద్ద ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి స్వీట్లు, చాక్లెట్లు పంచిపెట్టి ఘనంగా ఆయన జయంతి జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నవయుగ చైతన్య ప్రగతి సొసైటీ రాష్ట్ర అధ్యక్షురాలు PJ.లక్ష్మీ మాట్లాడుతూ, ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రపంచ దేశాలకు సమానత్వాన్ని చాటి చెప్పిన భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. బడి ఈడు పిల్లలను అందర్నీ చదివించి మంచి పాఠశాలలో చేర్పించి వారి అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తమ సొసైటీ ద్వారా యువతి యువకులకు ఉచితంగా కొన్ని సదుపాయాలను కల్పించబోతున్నట్లు తెలియజేశారు. మాదిగ కాంటాక్ట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ నవయుగ చైతన్య ప్రగతి సొసైటీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ పెద్దనపాడు శివరాo మాట్లాడుతూ, భారత రాజ్యాంగ రూపకర్త బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని కృషిచేసిన మహనీయుడు, మహానుభావుడు, ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ సమాజంలో మార్పు రావాలంటే ప్రతి ఒక్కరూ ఆర్థికపరంగా, రాజకీయపరంగా, విద్య, వైద్య, ఆరోగ్యపరంగా ముందుకు వెళ్లాలని తెలియజేశారు.










Comments