కడప - తిరుపతికి నాన్ స్టాప్ బస్సులు - నేడు 12 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం.
- PRASANNA ANDHRA

- May 1, 2023
- 1 min read
కడప జిల్లా
కడప - తిరుపతికి నాన్ స్టాప్ బస్సులు
నేడు 12 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం.
పెద్దలకు ఛార్జీ రూ.340, పిల్లలకు రూ.260 ఛార్జీ.


ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు సోమవారం రోడ్డెక్కనున్నాయి. కడప ఆర్టీసీ బస్టాండు ఆవరణలో 12 విద్యుత్తు ఎలక్ట్రిక్ బస్సులను డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఆర్టీసీ ఛైర్మన్ మల్లిఖార్జునరెడ్డి, మేయర్ సురేష్ బాబు లు ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆరు బస్సులు నాన్ స్టాప్ కింద నడవనున్నాయి. కడప, తిరుపతి నుంచి ఉదయం 4.30 గంటలకు తొలి బస్సు, రాత్రి 7.30 గంటలకు చివరి బస్సు నడపనున్నారు.












Comments