శ్రీకాళహస్తిలో 100 పడకల కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం
- PRASANNA ANDHRA

- Jan 19, 2022
- 1 min read
శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్న టూరిస్ట్ బస్ స్టాండ్ వసతి గృహ సముదాయంలో ఏర్పాటు చేసిన 100 పడకల కొవిడ్ కేర్ సెంటర్ను ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమారుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి ప్రారంభించారు.
బియ్యపు ఆకార్ష్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లోని కరోనా బాధితుల కోసం ఈ కేర్ సెంటర్ను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. సెంటర్లో రోగులకు అవసరమైన ఆక్సిజన్, వెంటిలేటర్ సదుపాయాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు వైద్యులు అందిస్తున్నారని తెలియజేశారు. వైరస్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాలాజీ నాయక్ గారు, వైయస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.














Comments