ఆరోపణలా! వాస్తవాలా! ఏది వాస్తవం? ఏది అవాస్తవం?
- PRASANNA ANDHRA

- Sep 15, 2022
- 1 min read
ఆరోపణలా! వాస్తవాలా! ఏది వాస్తవం? ఏది అవాస్తవం?

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు సెప్టెంబర్ 15
బుధవారం రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి విఎస్ ముక్తియార్ చేసిన ఆరోపణ వ్వ్యాఖ్యలను, వైసీపీ 4వ వార్డు మునిసిపల్ కౌన్సిలర్ వరికూటి ఓబుల రెడ్డి ఖండించారు. రాజకీయ ఎదుగుదల కోసం తప్పుడు ఆరోపణలు చేయటం సబబు కాదని హితువు పలికారు. గతంలో కూడా టీడీపీ నాయకులు తమపై బురద చల్లే ప్రయత్నం చ్చేశారని, కాగా బుధవారం నాడు ముక్తియార్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, నియోజకవర్గ టీడీపీ నాయకుల అంతర్గత కలహాల కారణంగానే తమలో తామే ఎస్సి ఎస్టీ కేసులు నమోదు చేసుకున్నారని, తాము ఎవరి మీద తప్పుడు కేసులు నమోదు చేయలేదని, నియోజకవర్గంలో గతంతో పోలిస్తే నేటి రాజకీయాలు ఎంతో మెరుగుపడ్డాయని హితువు పలికారు. ఇకనైనా టీడీపీ నాయకులు ప్రజా సమస్యలపై ద్రుష్టి సారించి వారితో మమేకమై నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.








Comments