విద్యామందిర్ క్లాసెస్ స్కాలర్‌షిప్ టెస్ట్–2025 బ్రోచర్ ఆవిష్కరణ
- PRASANNA ANDHRA

- 3 hours ago
- 1 min read
విద్యామందిర్ క్లాసెస్ స్కాలర్‌షిప్ టెస్ట్–2025 బ్రోచర్ ఆవిష్కరణ

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఐఐటి, జేఈఈ, నీట్ ఫౌండేషన్ కోచింగ్ రంగంలో దేశవ్యాప్తంగా విశ్వాసం, నైపుణ్యం, ఫలితాల పరంగా ప్రత్యేక గుర్తింపు పొందిన విద్యామందిర్ క్లాసెస్ (VMC), హైదరాబాద్‌లో తన కొత్త ఇంటర్మీడియట్ కాలేజీ ప్రారంభించింది. ఈ సందర్భంగా విఎంసి స్కాలర్‌షిప్ టెస్ట్ డిసెంబర్ 20, 2025న నిర్వహించనున్నట్లు వెల్లడించన ప్రొద్దుటూరు బిజెపి అధ్యక్షులు వంకదార నరేంద్ర, ఏపీ బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు ఎన్. కుమారి, బిజెపి ప్రొద్దుటూరు వైస్ ప్రెసిడెంట్ రోటి కాడి రెడ్డమ్మ, ఈ సందర్భంగా వారు స్కాలర్షిప్ టెస్ట్ 2025 కరపత్రాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బీజేపీ ప్రొద్దుటూరు అధ్యక్షులు నరేంద్ర మాట్లాడుతూ, విద్యామందిర్ వంటి సంస్థలు గ్రామీణ అలాగే పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు చక్కటి అవకాశం కల్పిస్తున్నాయని, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు జాతీయ స్థాయిలో మరింత మెరుగైన ఫలితాలు సాధించటంలో వియంసి కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
విఎంసి ఏజీఎం కందుల భరత్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, 40 ఏళ్ల విశిష్ట ప్రయాణంలో వేలాదిమంది విద్యార్థులకు ఐఐటీలు, ఎన్ఐటీలు, ప్రముఖ మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్, మాధాపూర్ లలో సుచిత్ర కేంద్రాల ద్వారా విద్యార్థులకు అత్యున్నత శిక్షణను అందించేందుకు ముందుకొచ్చిందని తెలిపారు.
“విద్యార్థులు తక్కువ వ్యయంతో అత్యుత్తమ కోచింగ్ పొందే లక్ష్యంతోనే స్కాలర్‌షిప్ టెస్ట్ ఏర్పాటు చేశామని, హైదరాబాద్‌లో మరింత ఆధునిక తరగతి గదులు, నిపుణులైన అధ్యాపకులు, సాంకేతిక సబ్యెక్ట్‌లలో ప్రత్యేక శిక్షణను అందించనున్నామన్నారు.
• స్కాలర్షిప్ టెస్ట్ లో టాప్ 10 మంది విద్యార్థులకు 100% స్కాలర్‌షిప్
• టాప్ 11–20 ర్యాంకులకు 80% స్కాలర్‌షిప్
• టాప్ 21–40 ర్యాంకులకు 60% స్కాలర్‌షిప్
• టాప్ 41–100 ర్యాంకులకు 40% స్కాలర్‌షిప్” రాయితీ అందిస్తున్నామని తెలిపారు.
మరిన్ని వివరాలకోసం 9512567567, 9121151616 నంబర్లలో సంప్రదించవచ్చు.








Comments