ఘనంగా మాజీ ఎమ్మెల్యే వరద పుట్టినరోజు వేడుకలు
- PRASANNA ANDHRA

- Nov 12, 2022
- 1 min read
ఘనంగా మాజీ ఎమ్మెల్యే వరద పుట్టినరోజు వేడుకలు

ప్రొద్దుటూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం ఉదయం నెహ్రు రోడ్డులోని ఆయన కార్యాలయంలో ఆయన అనుచరులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆయన అభిమానులు పెద్దఎత్తున బాణాసంచా పేల్చి, భారీ కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య మాట్లాడుతూ తమ నాయకుడు నంద్యాల వరదరాజులు రెడ్డి పాతిక సంవత్సరాలు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేగా సేవలు అందించారని, నిస్వార్ధపరుడు, నిరాడంబరుడయిన తమ నాయకుడు ఆయురారోగ్యాలతో కలకాలం జీవించి ప్రజలకు మరిన్ని సేవలను అందించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ మునిసిపల్ చైర్మన్ ఆసం రఘురామి రెడ్డి, రసూల్, పలువురు మాజీ కౌన్సిలర్లు, పలువురు నాయకులు, ఆయన అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.








Comments