top of page

భర్తకు ప్రేమ వివాహం జరిపించిన భార్య

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Sep 21, 2022
  • 1 min read

భర్తకు ప్రేమ వివాహం జరిపించిన భార్య

ree

సెప్టెంబర్:21, ప్రసన్న ఆంధ్ర


మారుతున్న కాలంలో విచిత్రమైన ప్రేమలు, పెండిండ్లు సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా జరగడం సర్వసాధారణమైంది. అదే క్రమంలో తిరుపతి జిల్లా డక్కిలి మండలం అంబెడ్కర్ నగర్ కు చెందిన జంగిటి కళ్యాణ్ కుమార్ గత మూడు సంవత్సరాలుగా చరవాణి ద్వారా విశాఖపట్నం చెందిన నిత్యశ్రీ అనే అమ్మాయి పరిచయం కావడం ఆమెతో నిరంతరం చాటింగ్, ప్రేమ పాటలు కొనసాగించాడు, ఈ ప్రేమ కథ మధ్యలో కడప జిల్లాకు చెందిన విమల అనే ఓ మహిళ చరవాణి ద్వారా కళ్యాణి జీవితంలో ఎంటర్ అయింది, గత తొమ్మిది నెలలుగా ఆమెతో ప్రేమ వ్యవహారం నడుపుతూ మూడు నెలల క్రితం రహస్య వివాహం చేసుకున్నాడు . ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు నిత్యశ్రీ అబ్బాయి తల్లిదండ్రులని కలిసి తన ఆవేదనను, వెళ్లబుచ్చింది ఆమె ప్రేమను, తను లేనిదే తన జీవితం వ్యర్థం అంటూ గత పది రోజులుగా ఇక్కడే ఉంటూ ప్రియుడు జాడ తెలుసుకొని కడప లో ఉంటున్న వారిని రెడ్ హాండ్ గా పట్టుకుని నిలదీసింది . ప్రియుడు తల్లిదండ్రుల స్వగ్రామమైన డక్కిలి మండల పరిధిలోని అంబేద్కర్ నగరకు రెండురోజుల క్రితం ముగ్గురు కలిసి విచ్చేశారు . సుదీర్ఘమైన వాదనలు, ప్రేమ విరాహాలు, బాధలు, ఒకరిని విడిచి ఒకరు ఉచివరకు ఒకరిని ఒకరు విడిచి ఉండలేక బుధవారం సాయంత్రం డక్కిలి మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వరుడు కళ్యాణ్, వధువు నిత్యశ్రీలకు భార్య విమల సమక్షంలో తల్లిదండ్రులు పెద్దల సమక్షంలో మరో పెళ్లి చేసి ప్రేమ కథకు సుఖాంతం పలికారు. ఈ సంఘటనతో నేటి కాలంలో యువత వారి కోరికలు ఆలోచనలు ఎలా ఉంటాయో అనేది అందరిలో చర్చినియాంశమైంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page