top of page

కొత్తపల్లి గ్రామ పంచాయతీ ఆర్థిక పనితీరు భేష్ - స్టేట్ స్పెషల్ ఆఫీసర్

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • May 27, 2023
  • 1 min read

కొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించిన స్టేట్ స్పెషల్ ఆఫీసర్

ree
స్పెషల్ ఆఫీసర్ కరుణాకర్ కు వినతి పత్రాన్ని సమర్పిస్తున్న కొనిరెడ్డి

ree

ప్రొద్దుటూరు, కొత్తపల్లి గ్రామ పంచాయతీ స్టేట్ స్పెషల్ ఆఫీసర్ కరుణాకర్, గోపవరం, కొత్తపల్లి గ్రామ పంచాయతీలలోని సచివాలయాలను శనివారం సందర్శించి రికార్డ్స్ లను ఆర్థిక పనితీరు పర్యవేక్షించారు. అలాగే ఎర్రగుంట్ల గ్రామ పంచాయతీ లను కూడా శనివారం ఉదయం ఆయన పర్యటించినట్లు చెప్పారు.

ree

కొత్తపల్లి గ్రామ సచివాలయ సిబ్బంది పనితీరు, సర్పంచ్ శివచంద్రారెడ్డి పనితీరు తనకెంతో సంతృప్తినిచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొనిరెడ్డి మాట్లాడుతూ సచివాలయ నిర్వహణకు, స్టేషనరీ, కరెంటు ఖర్చుల నిమిత్తం ప్రతినెల గ్రామపంచాయతీలే కర్చులు భరిస్తున్నాయని, సచివాలయంలో వచ్చే ఆదాయాన్ని మాత్రం ప్రభుత్వానికి పంపిస్తున్నామని, సచివాలయ కర్చుల నిమిత్తం ప్రభుత్వం నిధులు కేటాయించాలని ఆయన అభ్యర్థిస్తూ స్పెషల్ ఆఫీసర్ కరుణాకర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ విషయాన్ని తాను తమ డైరెక్టర్ తో, పై అధికారులకు తెలియజేసి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని స్పెషల్ ఆఫీసర్ కరుణాకర్ అన్నారు.

ree

ఈ కార్యక్రమంలో కొత్తపల్లి సర్పంచ్ శివ చంద్రారెడ్డి, ఎంపీడీవో ఉపేంద్ర రెడ్డి, గోపవరం ఉపసర్పంచ్ రాఘవరెడ్డి, గోపవరం సెక్రటరీ, తదితరులు పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page