ఎస్ ఎల్ ఎన్ ఆసుపత్రి ప్రారంభించిన బత్యాల.
- DORA SWAMY

- Sep 10, 2023
- 1 min read
ఎస్ ఎల్ ఎన్ (శ్రీ లక్ష్మీనరసింహ) ఆసుపత్రి ప్రారంభోత్సవంలో బత్యాల.

రైల్వే కోడూరు గ్రామం, చిట్వేల్ రోడ్డు మెయిన్ స్కూల్ ప్రక్కన.. వై.కోట(ఏర్రగుంట కోట) లేట్.. నల్లంశెట్టి పెద్ద యల్లయ్య కుమారులు మహేష్ , కిషోర్ లు స్థాపించిన ఎస్ ఎల్ ఎన్ (శ్రీ లక్ష్మీనరసింహ) మెడికల్స్, ల్యాబ్,ఆసుపత్రినీ.. టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చంగల్ రాయులు ఆదివారం ఉదయం ప్రారంభించారు.

వైద్యం కోసం వచ్చేవారికి మెరుగైన సేవలు అందించాలని వారి సూచనలు పాటిస్తూ నమ్మకాన్ని సాధించాలనీ,అప్పుడే ఎంతటి పోటీ ఉన్నప్పటికీ ఎంచుకున్న రంగంలో ఉన్నత ఎదుగుదలను సాధించవచ్చని బత్యాల నిర్వహకులు మహేష్, కిషోర్ సూచించారు.

ఆసుపత్రి నిర్వహకులు మాట్లాడుతూ.. ప్రతిరోజు ఒక ప్రత్యేక విభాగానికి సంబంధించి సీనియర్ వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారని అన్నారు. తక్కువ ధరకే అన్ని రకాల వైద్య పరీక్షలు, తగ్గింపు ధరలతో బ్రాండెడ్ కంపెనీల మందులు, ఇంటి వద్దకే వచ్చి రక్తపు నమూనా సేకరణ, మందుల డెలివరీ తదితర సేవలను అందరికీ అందుబాటులో ఉన్నాయని అందరూ ఈ సేవలను ఉపయోగించుకోవాలని తెలిపారు. ఏదేని సమాచారం కోసం 9948000456 మరియు 7702942006 ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంటాయన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.








Comments