ఆర్టిపిపిలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన
- PRASANNA ANDHRA

- Nov 4, 2022
- 1 min read
ఆర్టిపిపిలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన
ఆర్టీవీపీలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక నాయకుడు విజయ్ కృష్ణ బాబు మాట్లాడుతూ నెల్లూరు పవర్ ప్లాంట్ నుంచి రిలీవ్ ఆర్డర్ తీసుకొని ఈపీడీసీఎల్ సంబంధించి కట్ ఆఫ్ డేట్ ఉన్న 39 మంది ఉద్యోగులు ఆర్టీవీపీలో చేరేందుకు రావడంపై నిరసన వ్యక్తం చేశారు 1650 మంది కార్మికులని కూడా వారితో పాటు రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు, లేని పక్షంలో ఆర్టీపీపి కార్మికులతో సహా ఉద్యమించడానికి తాను ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నానని, ఎంతటి త్యాగానికైనా సిద్ధమని హెచ్చరించారు. గతంలో 600 మెగా వాట్ల ప్లాంటుకు భూములు ఇచ్చిన రైతుల ఉద్యోగాల కోసం, అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఉద్యోగాలలో, ఇతరులకు దారాదత్తం చేస్తే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని హెచ్చరించారు.








Comments