ఆర్.టి.పి.పి విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల బైక్ ర్యాలీ
- PRASANNA ANDHRA

- Sep 11, 2022
- 1 min read

ఈరోజు ఆర్ టి పి పి విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల రీజినల్ JAC పిలుపు భాగంగా, ఆర్టిపిపి నుంచి ఇడుపులపాయ బైక్ ర్యాలీగా వెళ్లేందుకు బయలుదేరి, మార్గమధ్యంలో పోలీసులు తగు పరిమిషన్ లేదని, బైక్ ర్యాలీకి అనుమతికి లేదని ర్యాలీని నిలువరించారు. అక్కడే స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోకు వినతి పత్రం ఇచ్చారు. ముఖ్యమంత్రి విద్యుత్ కాంటాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేస్తాను అని ఎర్రగుంట్ల పాదయాత్ర లో భాగంగా మొట్టమొదటి 9-11-2017 తేదిన బహిరంగ సభలో హామీ ఇవ్వడం జరిగిందని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో భారీ ఎత్తున ఉద్యమాలకు సిద్ధం అవుతున్నారని జేఏసీ నాయకులు తెలిపారు.








Comments