స్పందన అర్జీదారుల ఫిర్యాదులు వాస్తవమే. ఆర్డీవో కోదండరామిరెడ్డి.
- DORA SWAMY

- Jul 28, 2022
- 1 min read
స్పందన అర్జీదారుల ఫిర్యాదులు వాస్తవమే
ఉన్నత అధికారులకు నివేదిక వెల్లడిస్తాం
అని పేర్కొన్న ఆర్డీవో. కోదండరామిరెడ్డి.

అన్నమయ్య జిల్లా చిట్వేలి మండల పరిధిలోని పలు గ్రామాలలో భూ మరియు ఇంటి ఆక్రమణలు జరిగాయని అర్జీదారులు జిల్లా కలెక్టర్ కు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడంతో ఈ రోజున జాయింట్ కలెక్టర్ తమిమా అన్సరియా ఆదేశాల మేరకు చిట్వేలి మండలానికి విచ్చేసిన రాజంపేట ఆర్డీవో కోదండరామిరెడ్డి తొలితగా రెవెన్యూ కార్యాలయం నందు స్థానిక ఎమ్మార్వో మురళీకృష్ణ తో కలిసి సంబంధిత భూ, స్థల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. తదుపరి అర్జీదారులు పేర్కొన్న గ్రామాలైన మైలపల్లి,గట్టుమీద పల్లి లకు వెళ్లి ఫిర్యాదులలో పేర్కొన్న ఆయా భూములను, ఇంటి స్థలాన్ని పరిశీలించి వాటి పూర్వ ఫలాలను గురించి ఆరా తీశారు.
తదుపరి పాత్రికేయులతో మాట్లాడుతూ... అర్జీదారులు పేర్కొన్న ఫిర్యాదులు పరిశీలించిన పిమ్మట వారు తెలిపిన ఫిర్యాదులు వాస్తవమేనని ఈ నివేదికలన్నింటిని జిల్లా కలెక్టర్ కు నివేదించి తదుపరి సంబంధిత ఆక్రమణదారులపై చర్యలు గైకొంటామని తెలియపరిచారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ తో పాటు స్థానిక ఎమ్మార్వో మురళీకృష్ణ,మండల సర్వేయర్ బాలసుబ్రమణ్యం, గ్రామ సర్వేయర్లు, గ్రామ విఆర్వోలు, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








Comments