top of page

సంయమనం పాటించండి - ఆర్డీవో

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Dec 7, 2022
  • 1 min read

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు

ree

బుధవారం మధ్యాహ్నం స్థానిక అర్ అండ్ బి అతిధి గృహం నందు ఆర్డీవో శ్రీనివాసులు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాజపేయి నగర్ ఆక్రమిత కట్టడాలను కూల్చివేసిన నాటినుండి పలు ప్రజా సంఘాలు, పార్టీల నాయకులు వివిధ రకాల ఆరోపణలు గుప్పిస్తూ ఆరోపణలు చేస్తున్నారని, వాజపేయి నగర్ వాసులకు వాస్తవాలు తెలుసునని, మరోమారు ప్రజలకు వాస్తవాలు తెలుపటానికే తాను నేడు పాత్రికేయుల సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హైకోర్ట్ ద్వారా అధికారులకు అందిన ఉతర్వులను అమలు చేశామని, ఆదేశాలు కూడా పూర్తిగా అమలు కాలేదని తెలుపుతూ, కడప ల్యాండ్ గ్రాబింగ్ కోర్ట్ ఉత్తర్వులు అమలు చేసి  శిధిలాలు తొలగించి స్థల యజమానులకు అప్పగిస్తేనే పూర్తిగా ఉత్తర్వులు అమలు చేసినట్లని ఆయన తెలిపారు.

ree

కాగా కడప కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వాసితులకు జగనన్న కాలనీ నందు స్థలం కేటాయించి తాజాగా స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి భూమి పూజ నిర్వహించి ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టారన్నారు. త్వరలో నూట ముప్పై ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి వాజపేయి నగర్ వాసులకు అందివ్వనున్నట్లు తెలిపారు. తాను వాజపేయి నగర్ వాసుల సంక్షేమం కొరకు హైకోర్ట్ ఉత్తర్వులు వెలువడిన నాటినుండి వారికి అండగా నిలుస్తున్నానని, హైకోర్టు ఉత్తర్వుల మేరకే ఆక్రమిత ఇళ్లను కూల్చటం జరిగిందని, శిధిలాలను కూడా పూర్తిగా తొలగించి స్థలాన్ని కొలతలు వేసి యజమానులకు అప్పగిస్తామని, తాము ఉత్తర్వులను అమలు చేస్తున్న నేపథ్యంలో వచ్చిన ఆరోపణలను పూర్తిగా కండిస్తు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు సంయమనం పాటించి అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. హైకోర్ట్ ఉత్తర్వులను అమలు చేయని యెడల అది కోర్ట్ ఉత్తర్వులను దిక్కరించినట్లు అవుతుందని గుర్తు చేస్తూ, శిధిలాలు తొలగించి ఖాళీ జాగా కొలతలు వేసి యజమానులకు త్వరలో అప్పగించనున్నట్లు ఆయన వెల్లడించారు.

CALL NOW 9912324365
CALL NOW 9912324365

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page