సచివాలయ సిబ్బంది భరతం పట్టిన బాధితురాలు
- PRASANNA ANDHRA

- Jun 25, 2023
- 1 min read
సచివాలయ సిబ్బంది భరతం పట్టిన బాధితురాలు


కడప జిల్లా, మైదుకూరు
సీఎం జగన్ మోహన్ రెడ్డి మానస పత్రిక సచివాలయలు అవినీతి కేరాఫ్ అడ్రస్ గా మారాయి, కులం, మతం, ప్రాంతం, చూడకుండా ప్రజలకు సంక్షేమ పథకాల అందించమని సీఎం జగన్మోహన్ రెడ్డి అదేచించిన సచివాలయ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శి స్తున్నారు.

మైదుకూరు మున్సిపాలిటీ పదవ వార్డు ఇన్చార్జి వెల్ఫేర్ సచివాలయాధికారి భరతం పట్టిన బాధితులు. లంచం డిమాండ్ చేసిన సచివాలయం వెల్ఫేర్ అధికారి శంకర్ ను నడిబజారులో నిలదీసిన లబ్ధిదారు రవణమ్మ బంధువులు. మధ్యవర్తి ద్వారా ఒక్కో లబ్ధిదారుల నుండి అయిదు వేల రూపాయల సొమ్మును వసూలు చేస్తున్నారని ఆరోపణ. అయిదు వేల రూపాయల లంచం ఎందుకు ఇవ్వాలని అడిగినందుకే నీకు అప్రూవ్ చేయను ఇష్టం వచ్చిన వాళ్ళకి చెప్పు కో అంటున్నాడని బాధిత మహిళ నిలదీత. ఎట్టకేలకు బాధితుల నుండి తప్పించుకొని ఉడయించిన సచివాలయాధికారి.

పదవ వార్డు సచివాలయ పరిధిలో నేతన్న నేస్తము పై ఈ సమగ్ర విచారణ నిర్వహిస్తే అనేక అక్రమాలు బయటికి వస్తాయని తెలిపిన బాధితులు. సచివాలయ అధికారిపై విచారణ చేసి అధికారులు చర్యలు చేపట్టాలని బాధితుల డిమాండ్.









Comments