పురుగు మందు తాగి వ్యక్తి మృతి
- EDITOR

- Aug 9, 2023
- 1 min read
పురుగు మందు తాగి వ్యక్తి మృతి

ఈరోజు ఉదయం ఖాజీపేట మండలం భూమయ్య పల్లె గల బ్రిడ్జి కింద ముత్తులూరుపాడు గ్రామానికి చెందిన ఎల్లుగారి నర్సింహులు, వయసు 38 సంవత్సరాలు, తండ్రి మద్దిలేటి, అను అతను మద్యంలో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య 5 మంది పిల్లలు సంతానం.

ఇతను మద్యానికి బానిస అయ్యి, ప్రతిరోజు మద్యం కు డబ్బులు ఇవ్వమని తన భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. కుటుంబం గురించి పట్టించుకోకుండా, నాకు త్రాగడానికి డబ్బులు ఇవ్వకుంటే నేను చనిపోతాను అని తరచుగా తన భార్య తో అంటూ వుండేవాడు. గతంలో కూడా ఇతను పురుగుల మందు మరియు సూపర్ వాస్మల్ తాగి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసినట్లు తెలిసింది. మృతుని భార్య ఎల్లుగారి అక్కయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాజీపేట పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయుచున్నాము.









Comments