వార్డు మెంబర్ ఆకస్మిక మృతి
- PRASANNA ANDHRA

- Sep 24, 2022
- 1 min read
వార్డు మెంబర్ ఆకస్మిక మృతి


ప్రొద్దుటూరు నియోజకవర్గ కొత్తపల్లె పంచాయతీ మత్చ్య కాలనీ 13వ వార్డు మెంబెర్ మురళిధర్ రెడ్డి అకస్మాత్తుగా మృతి చెందారు. హోమస్ పేట నాగ దస్తగిరి హాస్పిటల్ నందు సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో అనారోగ్యంతో మృతి చెందినట్లు ధ్రువీకరించిన ఆసుపత్రి వర్గాలు. పార్థివ దేహాన్ని సందర్శించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, కొత్తపల్లె సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి, పలువురు వైసీపీ నాయకులు, మునిసిపల్ కౌన్సిలర్లు, కొత్తపల్లె వార్డు మెంబర్లు. మురళీధర్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతిని తెలియచేసిన వైసీపీ వర్గాలు.








Comments