పుట్టిన రోజున పేదలకు అన్నం పంచిన అజయ్ వర్మ.
- DORA SWAMY

- Jun 20, 2022
- 1 min read
మానవతా ఆధ్వర్యంలో
పుట్టిన రోజున పేదలకు అన్నదానం.

అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం మైలపల్లి పంచాయతీ ఎం రాచపల్లి గ్రామం ఉమ్మలరాజు అజయ్ వర్మ జన్మదినం సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎంఈఓ ఆఫీస్ ప్రాంగణంలో పేదలకు,పారిశుద్ధ్య కార్మికులకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.
అజయ్ వర్మ మాట్లాడుతూ నాజన్మదినం సందర్భంగా పేదలకు ఆహారాన్ని పంచడం నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని అలాగే ప్రతి ఒక్కరూ జన్మదినం సందర్భంగా ఆడంబరాలకు పోక పేదలకు ఆహార పంచితే వారి కడుపు నింపడం తో పాటు కళ్ళల్లో ఆనందం చూడొచ్చని; ఆ ఆనందం ఎంతో సంతృప్తిని ఇస్తుందని అజయ్ వర్మ అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల మానవతా సేవా సంస్థ బాధితులు ముని రావు, రిపోర్టర్లు వరుణ్ కుమార్ రాజు, ఎం నాగరాజు,వెంకటేష్ రాజు,యానాది రాజు,బాలరాజు,వెంకటేష్ రాజు,నరేష్ రాజు, చందు రాజు,శంకర్ రాజు,ఎం రాచపల్లి యూత్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.








Comments